KMR: జుక్కల్ నియోజకవర్గంలోని గుండూర్ శివారులో మంగళవారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ డీజే పాటలకు కలిసి చిందులేస్తూ సందడి చేశారు. నాయకుల ఆటపాటలతో వేడుకల్లో ఉత్సాహం నెలకొంది. వారి నృత్యాలను స్థానికులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
VIDEO: డీజే పాటలకు చిందేసిన ఎమ్మెల్యే


