ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో సెప్టెంబర్ 21న అగ్నిప్రమాదంలో ఐదుగురు శిశువుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేటీఆర్ మంగళవారం ఆరోపించారు. ఏసీ వైర్లను ఎలుకలు కొరికాయన్న 50 పేజీల కమిటీ నివేదికను తప్పుబట్టారు. శిశువుల వార్డులోకి ఎలుకలు ఎలా వచ్చాయని, నివేదిక ఎవరిని కాపాడేందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాయన్నారు.
తెలంగాణ
శిశువుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కేటీఆర్


