KRNL: ఆదోని ఎస్సీ నంబర్-1 హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుడ్లు, నిత్యావసర సరుకులు సక్రమంగా అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏఎస్‌డబ్ల్యూఓ వెంకటరాముడికి వినతిపత్రం అందజేశారు. వాచ్‌మెన్ మల్లేశప్పను బదిలీ చేయడంతో పాటు తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని తెలిపారు.
వార్తలు
'ఆదోని ఎస్సీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి'


