హైదరాబాద్: 28°C
తెలంగాణ

3.60 కిలోల కణతి తొలగింపు

MBNR: నారాయణపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అరుదైన ఫిలోడ్స్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న మహిళకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్లుగా కుడి రొమ్ములో గడ్డతో బాధపడుతున్నారు. జనరల్‌ సర్జన్‌ మురళీకృష్ణ, డా. వినీల రత్న ఆధ్వర్యంలో 3.60 కిలోల కణతిని తొలగించినట్లు సూపరింటెండెంట్‌ సంపత్‌ తెలిపారు.