హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబరాలు

KMM: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో నాలుగోరోజైన నానబియ్యం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, MLCలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. నానవేసిన బియ్యాన్ని గౌరమ్మకు నివేదించి, మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు.