హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శరవేగంగా బతుకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పనులు'

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం పెద్ద చెరువు ప్రాంతంలో బతుకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గద్దె నిర్మాణ పనులను ప్రారంభించినట్లు స్థానిక సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి తెలిపారు. ఈనెల 18న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చెరువు ప్రాంతంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.