హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా భాకరాపేటలో దుర్గామాతకు పూజలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల రెండో వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా..ఆలయ ప్రధాన అర్చకులు మధు మధుసూదన శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, కుంకుమార్చన,పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.