హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై శక్తి టీం అవగాహన

NDL: ఆత్మకూరు మండలం అమలాపురంలో ఉపాధి కూలీలకు శక్తి టీం మహిళల భద్రతపై అవగాహన కల్పించింది. శక్తి యాప్, బాల్యవివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆపద సమయంలో 112, మహిళల సహాయం కోసం 181, సైబర్ నేరాలపై 1930కు ఫోన్ చేయాలని తెలిపింది. హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం తాగి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించారు.