హైదరాబాద్: 28°C
తెలంగాణ

తైక్వాండోలో మునుగోడు విద్యార్థినుల ప్రతిభ

NLG: వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి SGF అండర్‌-17 తైక్వాండో పోటీల్లో మునుగోడు విద్యార్థులు సత్తా చాటారు. మునుగోడు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఏకంగా మూడు పతకాలు సాధించారు. పి. గిరిజ, కె. తేజశ్రీ రజత పతకాలు, యు. ప్రణవి కాంస్య పతకం గెలుచుకున్నారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్ కె. సంధ్యారాణి, పీడీ నాగమణి తదితరులు అభినందించారు.