హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు

SRPT: కోదాడ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.52.50 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డిల ప్రత్యేక చొరవ, కృషితో.. నియోజకవర్గంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టీకరణ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.