KDP: సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద ఎస్సై హారిక మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, వాహన పత్రాలు లేని ఐదుగురు ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.185 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: SI


