బాపట్ల నియోజకవర్గంలో 122 మంది లబ్ధిదారులకు రూ. 59,27,754 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పంపిణీ చేశారు. బాపట్ల మండలానికి రూ.19.62 లక్షలు, పట్టణానికి రూ.17.88 లక్షలు, కర్లపాలెంకు రూ.12.63 లక్షలు, పిట్టలవానిపాలెంకు రూ.9.12 లక్షలు మంజూరయ్యాయి. ఆపదలో ఉన్న నిరుపేదలకు వైద్య సహాయం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
122 మందికి CMRF చెక్కుల పంపిణీ


