హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుమ్మలపాలెం చెక్‌పోస్ట్ వద్ద టిప్పర్ బోల్తా..!

NTR: ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం మైనింగ్ చెక్‌పోస్ట్ సమీపంలో మంగళవారం కంకర టిప్పర్ లారీ బోల్తా పడింది. విజయవాడ వెళ్తుండగా మరో లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు లారీని తొలగించి రవాణాను పునరుద్ధరించారు.