హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూగర్భజల స్థాయిని పెంచాలి: DPO

GDWL: ఇటిక్యాల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భజల స్థాయిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.