హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ఎన్నికల భద్రతపై ఎస్పీ తనిఖీలు

అన్నమయ్య: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పుంగనూరులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.