హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట పట్టణానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంజూరు చేయడాన్ని హర్షిస్తూ బాణాసంచా కాలుస్తూ స్వీట్లను పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంకూస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాజీపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు


