హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్

SRPT: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.