ASR: అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ రెల్లి వీధిలో ఏడాదిగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సీపీఎం నేత సింగులు ఆవేదన చెందారు. సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్న వీధిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, డ్రైనేజీలను శుభ్రం చేసి మురుగునీరు నిల్వ లేకుండా చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాశీపట్నం రెల్లి వీధిలో డ్రైనేజీల దుస్థితి


