కృష్ణా: ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి కలెక్టర్ బాలాజీ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో రాకపోకలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


