హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి: నగేష్ గౌడ్

JN: జాఫర్‌గఢ్ మండలంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు బీమా ద్వారా పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.