హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమాలను ఉధృతం చేయాలి: CPI

KMM: చింతకానిలో మంగళవారం జరిగిన CPI మండల సమితి సమావేశంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని, ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.