హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురు వందనం–2026లో మెచ్చు రాణికి గౌరవం

BDK: దమ్మపేట మండలం, గండుగులపల్లికి చెందిన ఉపాధ్యాయురాలు మెచ్చు రాణి జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'గురు వందనం–2026' కార్యక్రమంలో ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆమెను అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.