హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

KMR: జిల్లాలో బతుకమ్మ వేడుకలను  ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో సమావేశంలో పర్యాటక అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజల భాగస్వామ్యంతో బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. సమీక్షలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.