MDK: చేగుంట జాతీయ రహదారి బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును మారుతి కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేగుంట నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మారుతి కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
తెలంగాణ
ఆర్టీసీ బస్ ను డికొన్న కారు


