హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికార సైరన్‌లపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

HYD: నగరంలో అనధికారికంగా సైరన్‌లు అమర్చిన వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సైరన్  దుర్వినియోగాన్ని అరికట్టడం, ట్రాఫిక్ నిబంధనల అమలును నిర్ధారించడం ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చట్టబద్ధంగా అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే సైరన్‌లు వాడాలని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.