హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీటీఆర్ వైఫల్యాల నివారణకు సీఎండీ ఆదేశాలు'

HYD: TGSPDCL పరిధిలో DTR వైఫల్యాలను నివారించి, రైతులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. వైఫల్యం జరిగిన 24 గంటల్లోపు SAPలో నమోదు చేసి, త్వరితగతిన ట్రాన్స్‌ఫార్మర్లు మార్చాలన్నారు. రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు మోసే పరిస్థితి రాకూడదని, నాణ్యమైన మరమ్మతులు, లూజ్ లైన్‌ల తొలగింపు, తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలన్నారు.