హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో అంగన్వాడీలకు వైజ్ఞానిక క్లాసులు

WG: భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తల విద్యా వైజ్ఞానిక తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఏ. రవి పాల్గొని మాట్లాడారు. మూఢనమ్మకాలు వీడి శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ.. కార్మికులకు నష్టం చేసే నయా ఉదారవాద విధానాలపై శ్రామిక వర్గం ఐక్యంగా పోరాడాలని కోరారు.