హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఛైర్మన్ పదవి జనసేనకు ఇవ్వండి'

KRNL: ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించి, పార్టీ ఇంఛార్జ్ మల్లప్పకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆదోని జనసేన నాయకులు కోరారు. పార్టీ రాష్ట్ర స్థానిక సంస్థల సమన్వయకర్త, ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసు ఇవాళ కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ విజ్ఞప్తిపై బొల్లిశెట్టి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించడంతో జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం వ్యక్తమైంది.