హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్ షాప్ వద్ద ఘర్షణ:.. నలుగురి అరెస్ట్

VSP: ఆరిలోవ లాస్ట్ బస్ స్టాప్ సమీపంలోని వైన్ షాప్ వద్ద ఈ నెల 11న ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో బీరు బాటిళ్లతో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో ఇరువర్గాలకు చెందిన ముల్లి దినేష్, రాజోలు సుధాకర్, కొప్పర వంశీ తీవ్రంగా గాయపడ్డారు.​ దినేష్ ఫిర్యాదు మేరకు ఆరిలోవ సీఐ ఎస్.శ్రీనివాస్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన ఎస్సై హెచ్.వరహాల నాయుడు రిమాండ్‌కు తరలించారు.