హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తు గడువు ఈనెల 27 వరకు పొడిగింపు

KRNL: (NMMS) స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 27 వరకు పొడిగించినట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. పరీక్షను నవంబర్ 29న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన 8వ తరగతి విద్యార్థులు www.bse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.