హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాజీపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

HNK: కాజీపేట విద్యానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన అందించే ఈ పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా వసతులు ఏర్పాటు చేయనున్నారు.