హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంక్షన్ విస్తరణకు ఎమ్మెల్యే భూమిపూజ

VSP: ట్రాఫిక్ సమస్య నివారణకు రూ.81 లక్షలతో చేపట్టిన ఆనందపురం జంక్షన్ విస్తరణ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం భూమిపూజ చేశారు.​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో జంక్షన్‌లో ట్రాఫిక్ పెరిగిందన్నారు. నిధులను సద్వినియోగం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.