హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఐవీపై అవగాహనతోనే అపోహలకు చెక్‌

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రజా చైతన్య సేవా సంఘం (PCSS–TI NGO) ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ టీ. స్వాతి హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలు, పరీక్షలు, చికిత్సపై వివరించారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.