హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMS ఆస్పత్రికి వెళ్తున్నారా? ఇది మీ కోసమే!

HYD: నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రాబోయే మూడు నెలల పాటు సీసీ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఈ పనుల కారణంగా ఆస్పత్రిలో పార్కింగ్ స్థలం పరిమితంగా ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అంబులెన్సుల అత్యవసర రాకపోకల కోసం రోగులు, ప్రజారవాణాను (ఆర్టీసీ/మెట్రో) ఉపయోగించాలని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ కోరారు.