NTR: ఏ.కొండూరు మండలంలోని వల్లంపట్ల, కంభంపాడు, కృష్ణారావుపాలెం, ఏ.కొండూరు తండాలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఒక్కో కేంద్రానికి రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.1.44 కోట్లు కేటాయించారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన


