హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి పట్టణ అధ్యక్షుడు రాజీనామా

పార్వతీపురం వైసీపీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్ కొండపల్లి రుక్మిణి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. వీరు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పట్టణంలో రాజీనామా చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు.