హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

PDPL: కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ మంథనిలో జరుగుతున్న పుష్కర ఘాట్ వద్ద రోడ్డు, హెలి ప్యాడ్, 50 పడకల ఆసుపత్రి, సమీకృత డివిజన్ కార్యాలయాల సముదాయం, మున్సిపల్ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించారు. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల భక్తులకు ఇబ్బందులు కలగకుండా రహదారి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.