హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: సీపీ

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల అధికారులతో నేర సమీక్ష నిర్వహించి కేసుల పురోగతిని పరిశీలించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని సూచించారు.