హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్: మిర్చి, టమాటా పంటల పరిశీలన..!

KMM: వాతావరణ మార్పుల నేపథ్యంలో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని మిర్చి, టమాటా పంటలను జిల్లా ఉద్యాన అధికారి ఎంవీ మధుసూదన్ పరిశీలించారు. రైతులు సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంటలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో పలువురు అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.