హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వసతి గృహాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

గుంటూరు జిల్లాలో ‘మార్పు’ కార్యక్రమం కింద చేపట్టిన వసతి గృహాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.