హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోడౌన్‌‌ను తనిఖీ చేసిన కలెక్టర్

W.G: భీమవరం పీపీ రోడ్డులోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేశారు. గోడౌన్ సీళ్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈవీఎంల రక్షణ పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతినెలా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.