హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి'

KRNL: ఆదోనిలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని SFI నాయకులు ASP శర్మకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మహిళలు ఫిర్యాదుల కోసం కర్నూలుకు 120 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు, బాలికలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.