హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన

ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణంతో కాలనీలో రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు.