హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడద నుండి కాపాడండి: చిన్నారులు

SDPT: హుస్నాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు తమను రక్షించాలని మున్సిపల్‌ అధికారులను కోరారు. పాఠశాలకు వెళ్లే సమయంలో, బయట ఆడుకునేటప్పుడు కోతులు దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా సెలవుల్లోనూ స్వేచ్ఛగా ఆడుకోలేకపోతున్నామని పేర్కొంటూ, కాలనీలోని కోతులను వెంటనే పట్టించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.