హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ జగదీష్

ATP: తాడిపత్రి సబ్ డివిజన్‌లోని పలు హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో జిల్లా ఎస్పీ పి.జగదీష్ మంగళవారం పర్యటించి, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వీరాపురం, ఆలూరు తదితర గ్రామాల్లోని పోలీస్ పికెట్లను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు పాల్గొన్నారు.