హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి'

AKP: నక్కపల్లి ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ క్యాప్టివ్ పోర్టు ఈఐఏ నివేదికలో లోపాలున్నందున ఈనెల15న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాలుష్ నియంత్రణ మండలి ఈఈ ముకుందరావుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. పోర్టు నిర్మాణంతో సముద్ర కాలుష్యం, మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతుందన్నారు.