హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మశాన వాటిక స్థలంలో నిర్మాణాల నిలిపివేత

RR: హయాత్‌నగర్‌ మునుగనూర్ రోడ్డులోని హిందూ స్మశాన వాటిక స్థలంలో ఎంఎంసీ చేపడుతున్న ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి అడ్డుకున్నారు. ప్రజల మనోభావాలతో ముడిపడిన ఈ స్థలంలో సమాచారం లేకుండా పనులు చేపట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి స్మశాన వాటిక స్థలాన్ని పరిరక్షించాలన్నారు.