హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణ మాసంలో అగ్రగామిగా జగిత్యాల

JGL: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సత్తా చాటింది. పోషణ మాసం కార్యక్రమాల నమోదులో 106.9% ప్రగతితో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 1,065 అంగన్‌వాడీల పరిధిలో లక్ష్యాన్ని మించి 1,31,048 కార్యకలాపాలు నమోదయ్యాయి. ఈ అద్భుత విజయం సాధించిన DWO, పోషణ అభియాన్ సిబ్బందిని అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.