హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంజీవ్‌

JGL: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాయికల్‌ పట్టణానికి చెందిన బన్న సంజీవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంజీవ్‌ మాట్లాడుతూ.. పార్టీ పటిష్ఠత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.