ELR: ఏజెన్సీ పరిధిలోని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని AIKMS కోరింది. ఈ మేరకు మంగళవారం ఏలూరులో విద్యుత్ శాఖ ఎస్ఈ అంబేద్కర్ కి వినతిపత్రం అందజేశారు. అలివేరు పంచాయతీ గ్రామాలకు గతంలో రిజర్వాయర్ మీదుగా విద్యుత్ లైన్లు వేయడంతో వర్షాకాలంలో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. రెడ్డిగణపవరం నుంచి బెడదనూరు వెళ్లే టౌన్ ఫీడర్ త్రీఫేస్ పనులు పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి


